హై అలెర్ట్...ఏపీకి మరో తుఫాను ముప్పు
ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు
ఆంధ్రప్రదేశ్ కు మరో తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. రాకపోకలు స్థంభించిపోయాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రైళ్లు, బస్సులు లేక వేరే ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు అనేక మంది. రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ నెల 6,7 తేదీల్లో...
మరో వైపు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందని అంచనా వేస్తుంది.